Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 43

Bhagiratha brings Ganga to earth !

బాలకాండ
నలుబది మూడవ సర్గము
( గంగావతరణము )

దేవ దేవే గతే తస్మిన్ సోంగుష్ఠాగ్రనిపీడితామ్ |
కృత్వా వసుమతీం రామ సంవత్సరముపాసత ||

స|| హే రామ ! దేవ దేవే గతే తస్మిన్ వసుమతీం సోంగుష్ఠాగ్రనిపీడితామ్ కృత్వా సంవత్సరమ్ ఉపాసత |

తా|| 'ఓ రామా ! దేవ దేవుడు అయిన బ్రహ్మ వెళ్ళిన తరువాత ( భగీరథుడు) వేళ్ళ మీద నిలబడి ఒక సంవత్సరము ఉపాసన చేసెను.

ఊర్థ్వ బాహుర్నిరాలంబో వాయుభక్షో నిరాశ్రయః |
అచలః స్థాణువత్ స్థిత్వా రాత్రిందివమరిందమ ||

స|| (సః) అరిందమ ఊర్ధ్వ బాహుః నిరాలంబో నిరాశ్రయః వాయుబక్షః స్థాణువత్ స్థిత్వా అచలః ఆసీత్ |

తా|| శత్రువులను జయించగల ఆ భరద్వాజుడు బాహువులను పైకి ఎత్తి, ఆశ్రయము లేకుండా, వాయువునే ఆహారముగా చేసికొని కదలకుండాఉండెను.

అథ సంవత్సర పూర్ణే సర్వలోకనమస్కృతః |
ఉమాపతిః పశుపతీ రాజానం ఇదమబ్రవీత్ ||

స|| అథ సంవత్సర పూర్ణే ఉమాపతిః పశుపతీ సర్వలోక నమస్కృతః రాజానం ఇదమబ్రవీత్ |

తా|| అప్పుడు ఒక సంవత్సరము గడిచిన పిమ్మట అన్ని లోకములచే నమస్కరించబడు పశుపతి అగు ఉమాపతి రాజుతో ఇట్లనెను.

ప్రీతస్తేsహం నరశ్రేష్ఠ కరిష్యామి తవప్రియమ్ |
శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహమ్ ||

స|| హే నరశ్రేష్ఠ తే అహం ప్రీతః | తవ ప్రియం కరిష్యామి | అహం శైలరాజ సుతాం శిరసా ధారయిష్యామి |

తా|| " ఓ నరశ్రేష్ఠా ! నీ కోరికను తీర్చెదను. నేను ఆ శైలరాజ సుతను నా సిరస్సుపై ధరించెదను"

తతో హైమవతీ జ్యేష్ఠా సర్వలోకనమస్కృతా |
తదా సాతి మహద్రూపం కృత్వా వేగం చ దుస్సహమ్|
ఆకాశాదపతత్ రామ శివే శివశిరస్యుత ||

స|| తతః సా జ్యేష్ఠా హైమవతీ సర్వలోక నమస్కృతా తదా దుస్సహం వేగం చ మహత్ రూపం కృత్వా శివ సురస్సు ఆకాశాత్ అపతత్ |

తా|| అప్పుడు హిమవంతుని జ్యేష్ఠ కుమార్తె అన్ని లోకములలో నమస్కరింపబడు ఆ గంగ మహా వేగముతో ఆకాశమునుండి శివుని సిరస్సు పై బడెను.

అచింతయచ్ఛ సా దేవీ గంగా పరమదుర్ధరా |
నిశామ్యహం హి పాతాళం స్రోతసా గృహ్య శంకరమ్ ||

స|| సా పరమదుర్ధరా దేవీ గంగా స్రోతసా గృహ్య శంకరమ్ పాతాళం హి నిశామ్యహం (ఇతి) అచింతయచ్చ |

తా|| ఆ ధరింపశక్యముగాని గంగ తన ప్రవాహముతో శంకరుని తీసుకొని పాతాళము వెళ్ళెదను అని అనుకొనెను.

తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః |
తిరోభావయితుం బుద్ధిం చక్రే త్రిణయనస్తదా ||

స|| భగవాన్ హరః తస్య అవలేపనం జ్ఞాత్వా క్రుద్ధ అస్తు. తదా త్రి నయనః తస్య తిరోభావయితుం బుద్దిం చక్రే |

తా|| భగవాన్ శంకరుడు గంగయొక్క గర్వము తెలిసికొని క్రుద్దుడు అయ్యెను. ఆ మూడు కన్నులవాడు ఆమె గర్వము అణుచుటకు సంకల్పించెను.

సా తస్మిన్ పతితా పుణ్యా పుణ్యే రుద్రస్య మూర్ధని|
హిమవత్ప్రతిమే రామ జటామండల గహ్వరే ||

స|| హే రామ ! రుద్రస్య పుణ్యే మూర్ధని హిమవత్ప్రతి జటామండల గహ్వరే (అస్తి) సా ( గంగా) పుణ్యా తస్మిన్ పతితా |

తా|| 'ఓ రామా ! శివుని శిరస్సు హిమవత్పర్వతములతో సమానమైన జటామండల గుహలతో ఉండెను. ఆ పుణ్యమైన గంగ ఆ జటామండలములో పడెను.

సా కథంచిన్మహీం గంతుం నాశక్నోద్యత్నమాస్థితా |
నైవ నిర్గమనం లేభే జటామండల మోహితా ||

స|| సా మహీం గంతుం కథంచిన్ యత్నమాస్థితా న సక్నోతి| జటామండలమోహితా న నిర్గమనమ్ ఏవ |

తా|| ఆ గంగ భూమిపై వెళ్ళుటకు ఎంత ప్రయత్నించిననూ వెళ్ళలేక పోయెను. ఆ జటామండలములలో చిక్కుకొని బయటికి రాలేక పోయెను.

తత్రైవాబంభ్రమద్దేవీ సంవత్సరగణాన్ బహూన్ |
తామపస్యన్ పునస్తత్ర తపః పరమాస్థితః ||

సా|| (సా) దేవీ తత్ర ఏవ బహూన్ సంవత్సర గణాన్ బంభ్రమత్ | తాం అపస్యన్ ( భగీరథః) పునః తత్ర తపః పరమాస్థితః |

తా|| ఆ దేవి అచటనే చాలా సంవత్సరములు తిరుగాడుచుండెను. అది చూచి భగిఅథుడు మరల తపస్సు చేయసాగెను.

అనేన తోషితశ్చాభూత్ అత్యర్థం రఘునందన |
విససర్జ తతో గంగాం హరో బిందు సరః ప్రతి ||

స|| హే రఘునందన ! అనేన అత్యర్థం తోషితశ్చ అభూత్ | తతః హరో గంగాం బిందుసరః ప్రతి విససర్జ |

తా||ఓ రఘునందన ! ఆ తపస్సుచే మిక్కిలి సంతుతుష్ఠుడై అప్పుడు మహదేవుడు ఆ గంగను బిందుసరస్సులో వదిలెను.

తస్యాం విశృజ్యమానాయాం సప్త స్రోతాంసి జజ్ఞిరే |
హ్లాదినీ పావనీచైవ నళినీ తథాs పరా ||
తిప్రః ప్రాచీం దిశం జగ్ముః గంగా శివజలా శ్శుభాః |
సుచక్షుశ్చైవ సీతా చ సింధుశ్చైవ మహానదీ ||
తిస్రస్త్వేతా దిశం జగ్ముః ప్రతీచీం తు శుభోధకాః |
సప్తమీ చాన్వగాత్ తాసాం భగరథమథోనృపమ్ ||

స|| తస్యాం విశ్రుజ్యమానాయాం సప్త స్రోతాంసి జజ్ఞిరే ! హ్లాదినీ పావనీ చ నళినీ ఏవ శుభాః శివజలాః గంగా ప్రాచీం దిశం జగ్ముః | అపరః తిప్రః సుచక్షుః సీతా సింధుశ్చ మహానదీ శుభోదకాః ఏతా తిస్రస్తు ప్రతీచిం జగ్ముః | అథ తాసాం సప్తమీ భగీరథం నృపమ్ అన్వగత్ చ |

తా|| ఆ విధముగా విడువబడిన గంగ సప్త నదులుగా సాగెను. హ్లాదినీ పావనీ నళినీ అనబడు శుభమైన గంగ జలములు తూర్పు దిశగా ప్రవహించెను. సుచక్షుః , సీతా , సింధు అనబడు మూడు నదులు పశ్చిమ దిశగా ప్రవహించెను. అప్పుడు ఏడవ నది భగీరథుని అనుసరించెను.

భగీరథోsపి రాజర్షిః దివ్యం స్యందనమాస్థితః |
ప్రాయే దగ్రే మహాతేజాః గంగా తం చాప్యనువ్రజత్ ||

స|| రాజర్షిః భగీరథః అపి దివ్యం స్యందన ఆస్థితః | ప్రాయేత్ అగ్రే గంగా తం మహాతేజాః చ అనువ్రజత్ |

తా|| రాజర్షి అగు భగీరథుడు ఒక రథముపై ఉండెను. ఆ మహాతేజోవంతుడు ముందుండగా గంగానది ఆయనను అనుసరించెను.

గగనాత్ శంకరశిరః తతో ధరణి మాశ్రితా |
వ్యసర్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతమ్ ||

స|| గగనాత్ శంకర శిరః తతః ధరణీం ఆశ్రితా జలం తీవ్ర శబ్ద పురస్కృతమ్ వ్యసర్పత |

తా|| ఆకాశమునుండి శివుని శిరస్సు పై , పిమ్మట ఆ శిరస్సునుంచి భూమిపై తీవ్రమైన శబ్దము చేయుచూ గంగ ప్రవహించెను.

మత్స్య కచ్ఛప సంఘైశ్చ శింశుమారగణైస్తదా |
పతద్భిః పతితైశ్చాన్యైః వ్యరోచత వసుంధరా ||

స|| మత్స్య కచ్ఛప సంఘైశ్చ శింశు మారగణైః తదా పతద్భిః పతైతాశ్చాన్యైః వసుంధరా వ్యరోచత |

తా|| అట్లు పడిన గంగ మత్స్యములతో తాబేళ్లతో ముసళ్ళతో ఇతర జంతువులతో భూమికి శోభ కూర్చెను.

తతో దేవర్షి గంధర్వా యక్షాసిద్ధగణాస్తదా ||
వ్యలోకయంత తే తత్ర గగనాద్గాం గతాం తథా |

స|| తతః దేవర్షి గంధర్వా యక్ష సిద్ధ గణాం తదా గగనాత్ గాం గతాం ( గంగాం) వ్యలోకయంత |

తా|| అప్పుడు దేవ ఋషి గంధర్వ యక్ష సిద్ధ సముహములు ఆకాశమునుండి వెళ్ళిన గంగను ఆశ్చర్యముతో చూచిరి.

విమానైర్నగరకారైః హయైర్గజవరైస్తదా |
పారిప్లవగతైశ్చాపి దేవతాస్తత్ర వీష్ఠితాః ||

స|| నగరకారైః విమానైః హయైః గజవరైః తదా పరిప్లవగతైశ్చ అపి దేవతాః తత్ర వీష్టితాః |

తా|| నగరాకారము లో నున్న విమానముల పై. అశ్వములపై, దిగ్గజములపై వున్న దేవులందరూ ఆ గంగను చూచిరి.

తదద్భుతతమం లోకే గంగాపతనముత్తమమ్ |
దిదృక్షవో దేవగణాః సమీరమితౌజసః ||

స|| తత్ అద్భుతతమం ఉత్తమమం గంగాపతనం లోకే దిద్రుక్షవో దేవగణాః సమీరమితౌజసః |

తా|| అ అద్భుతము పుణ్యకరమైన ఆ గంగాఅవతరనము చూచుటకు దేవ గణములందరూ అచటకు చేరిరి.

సంపతద్భిస్సురగణైః తేషాం చాభరణౌజసా |
శతాదిత్య మివాభాతి గగనం గతతోయదమ్ ||

స|| సురగణైః సంపతద్భిః తేషాం ఆభరణౌజసా చ గత తోయదం గగనం శతాదిత్య మివాభాతి |

తా|| ఆ సురగణముల ఆభరణ కాంతులతో దేదీప్యమానముగా మేఘములుతొలగిన ఆకాశములో వందలకొలదీ సూర్యులతో నున్నట్లు ఆ ఆకాశము శోభిల్లుచుండెను.

శింశుమారోరగగణైః మీనైరపి చ చంచలైః |
విద్యుద్భిరివ విక్షిప్తం ఆకాశం అభవత్తదా ||

స|| చంచలైః శింశుమారోరగణైః మీనైః అపి ఆకాశం విద్యుద్భిరివ విక్షిప్తం అభవత్ తదా|

తా|| కదులుచున్న మత్స్యములతో , మొసళ్ళతో ఆ ఆకాశము విద్యుత్కాంతులతో వెలుగుచున్నటుల ఉండెను.

పాండరైస్సలిలోత్పీడైః కీర్యమాణైః సహస్రథా |
శారదాభ్రైరివాకీర్ణం గగనం హంస సంప్లవైః ||

స|| పాండరైసలిలోత్పీడైః కీర్యమాణైః గగనం సహస్రథా సంప్లవైః శారదాభ్రైః ఆకీర్ణం మివ ( అస్తి)

తా|| పైకి లేచిన తెల్లటి నీటి నురుగులతో ఆకాశము హంసల గుంపులతోనూ శరత్కాలపు మేఘములతోనూ ఉన్నట్లు ఉండెను.

క్వచిద్ద్రుతతరం యాతి కుటిలం క్వచిదాయతమ్ |
వినతం క్వచిదుద్భూతం క్వచిద్యాతి శనైః శనైః ||

స|| క్వచిత్ ఉద్ధ్రుతతరం యాతి క్వచిద్ ఆయతం కుటిలం క్వచిత్ వినతం క్వచిత్ ఉద్భూతం క్వచిత్ యాతి శనైః శనైః (చలతి) |

తా|| భగీరథుని వెనక వెళ్ళుతున్న గంగ కొన్ని ప్రదేశములందు ఉధృతముగనూ కొన్ని ప్రదేశములలో వక్రముగను , కొన్నిప్రదేశములలో విస్తారముగనూ , కొన్ని ప్రదేశములలో మెల్లిగా మెల్లిగా సాగిపోవుచుండెను.

సలిలేనైవ సలిలం క్వచిదభ్యాహతం పునః |
ముహురుర్ధ్వముఖం గత్వా పపాత వసుధాతలమ్ ||

స|| సలిలేనైవ సలిలం ముహుః ఊర్ధ్వముఖం క్వచిత్ అభ్యాహతం గత్వా పునః పపాత వసుధాతలమ్ |

తా|| నీటి కెరటములు ఒకదానిపై ఒకటి పడిమరల పైకి లేచి మరల భూమిపై పడుచుండెను.

తచ్ఛంకరశిరోభ్రష్టం భ్రష్టం భూమితలే పునః |
వ్యరోచత తదా తోయం నిర్మలం గతకల్మషమ్ ||

స|| తత్ శంకర శిరో భ్రష్ఠం పునః భూమితలే భ్రష్ఠం తదా తోయం గత కల్మషం నిర్మలం వ్యరోచత |

తా|| శంకరుని తలపై తరువాత భూమిపై పడిన ఆ జలము కల్మషము లేకుండా నిర్మలముగా ప్రకాశించుచుండెను.

తత్ర దేవర్షి గంధర్వా వసుధాతులవాసినః |
భవాంగ పతితం తోయం పవిత్రమితి పస్పృశుః ||

స|| భవాంగ పతితం తోయం పవిత్రం ఇతి దేవర్షి గంధర్వా వసుధాతులవాసినః తత్ర పస్పృశుః |

తా|| శివుని శిరస్సు నుంచి పడిన జలము పవిత్రమని తలచి దేవతలూ గంధర్వులో వసుధాతుల వాసులందరూ ఆ జలముతో ఆచమనము చేసిరి.

శాపాత్ ప్రపితా యే చ గగనాద్వసుధాతలమ్ |
కృత్వా తత్రాభిషేకం తే బభూవుర్గతకల్మషాః ||
ధూతపాపాః పునస్తేన తోయే నాథ సుభాస్వతా |
పునరాకాశమావిశ్య స్వాన్ లోకాన్ ప్రతిపేదిరే ||

స|| గగనాత్ వసుధాతలం శాపాత్ ప్రపితా యే చ తత్ర అభిషేకం కృత్వా గత కల్మషాః తే బభూవుః |అథ తోయేన సుభాస్వతా తేన పునః ధూత పాపాః ఆకాశమావిశ్య పునః స్వాన్ లోకాన్ ప్రతిపేదిరే |

తా|| శాపవసాత్తు గగనమునుండి వసుధపైకి వచ్చిన వారందరూ ఆ నీటిలో అభిషేకము చేసి కల్మషములేని వారు అయిరి. ఆ నీటితో వెలుగొందుచూ పాపరహితులై మరల ఆకాశములో ప్రవేశించి తమ తమ లోకములకి పోయిరి.

ముముదే ముదితో లోకః తేన తోయేన భాస్వతా |
కృతాభిషేకో గంగాయాం బభూవ విగతక్లమః ||

స|| గంగాయాం అభిషేకో కృత విగత క్లమః తేన తోయేన భాస్వతా లోకః ముదితే ముముదే |

తా|| గంగలో స్నానము చేసి అలసటపోయినవారై ఆ నీటితో వెలుగొందుచూ లోకులందరూ సంతోషపడిరి.

భగీరథోsపి రాజర్షిః దివ్యం స్యందన మాస్థితః |
ప్రాయాదగ్రే మహాతేజాః తం గంగా పృష్ఠతోsన్వగాత్ ||

స|| రాజర్షిః భగీరథః మహాతేజాః అపి స్యందనం ఆస్థితః తం అగ్రే ప్రాయాద్ | గంగా పృష్ఠతో అన్వగాత్ |

తా|| మహాతేజోవంతుడు రాజర్షి అగు భగీరథుడు రథము ఎక్కిముందుగా పోవుచుండెను. గంగ ఆయన వెనుక వెళ్ళెను.

దేవా స్సర్షిగణా స్సర్వే దైత్య దానవరాక్షసాః |
గంధర్వయక్షప్రవరాః సకిన్నర మహోరగాః ||
సర్వాశ్చాప్సరసో రామ భగీరథ రథానుగామ్ |
గంగామన్వగమన్ ప్రీతాః సర్వే జలచరాశ్చయే ||

స|| హే రామ ! భగీరథ రథానుగాం గంగాం అన్వగన్ దేవాః ఋషిగణా సహ దైత్య దానవ రాక్షసాః గంధర్వ యక్ష ప్రవరాః కిన్నరైః సహ మహోరగాః అపి , అప్సరసాః సర్వాః చ జలచరాశ్చ సర్వే ప్రీతాః ||

తా||ఓ రామా ! దేవతలూ ఋషిగణములూ దైత్య దానవ రాక్షస గంధర్వయక్ష ప్రవర కిన్నరులతో సహా మహా నాగులూ అప్సరసలు ఇంకా జలచరములు అన్నియూ అందరూ సంతోషపడి భగీరథుని రథమును అనుసరించిరి.

యతో భగీరథో రాజా తతో గంగా యశస్వినీ |
జగామ సరితాం శ్రేష్ఠా సర్వ పాపవినాశినీ ||

స|| యతో భగీరథో రాజా తతో యశస్వినీ సరితాం శ్రేష్ఠా పాపవినాశనీ గంగా జగామ |

తా|| ఎక్కడ రాజా భగీరథుడు వెళ్ళెనో నదులలో శేష్ఠమైన, పాపమును నాశమొనర్చు గంగా కూడా అచటికి వెళ్ళెను .

తతో హి యజమానస్య జహ్నోరద్భుత కర్మణః |
గంగా సంప్లావయామాస యజ్ఞవాటం మహాత్మనః ||

స|| జహ్నో అద్భుత కర్మణః మహాత్మనః తస్య యజమానస్య యజ్ఞవాటం గంగా తతః సంప్లావయామాస |

తా|| అప్పుడు గంగ అసాధారణమైన కర్మలు చేయగల మహాత్ముడైన జహ్ను ఋషి యొక్క యజ్ఞవాటికను ముంచివేసెను.

తస్యా వలేపనం జ్ఞాత్వా క్రుద్ధో యజ్వా తు రాఘవ |
అపిబచ్చ జలం సర్వం గంగాయాః పరమాద్భుతమ్||

స|| హే రాఘవ ! తస్య అవలేపనం జ్ఞాత్వా క్రుద్ధో యజ్వా సర్వం గంగాయాః జలం పరమాద్భుతం అపిబచ్చ|

తా|| ఓ రామా ! గంగయొక్క అహంకారమును చూచి క్రుద్ధుడై ఆ గంగలోనున్న జలమంతయూ అద్భుతముగా తాగివేసెను.

తతో దేవాః సగంధర్వా ఋషయశ్చ సువిస్మితాః |
పూజయంతి మహాత్మానం జహ్నుం పురుషసత్తమమ్ |
గంగాం చాపి నయంతి స్మ దుహితృత్వే మహాత్మనః ||

స|| తతః దేవాః గంధర్వా సహ ఋషయః చ సువిస్మితాః జహ్నుం పురుషసత్తమమ్ మాహాత్మానం పూజయంతి | గంగాం చాపి మహాత్మనః దుహితృత్వే నయంతి స్మ |

తా|| అప్పుడు దేవతలు గంధర్వులు ఋషులతో కూడా ఆశ్చర్య పడి పురుషులలో ఉత్తమముడైన జహ్ను మహర్షిని పూజించిరి. గంగను ఆ మహాత్మునకు కుమార్తెగ చేసిరి.

తత స్తుష్టో మహాతేజా శ్రోతాభ్యాం అసృజత్ పునః |
తస్మాజ్జహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ ||

స|| తతః తుష్ఠో మహాతేజా శ్రోతాభ్యాం అసృజత్ పునః | తస్మాత్ గంగా జహ్ను సుతా జాహ్నవీ ఇతి చ ప్రోచ్యతే |

తా|| అప్పుడు సంతసించిన ఆ మహాత్ముడు మరల ఆ జలములను తన చెవులద్వారా విడిచెను. గంగ జహ్ను సుత అవుట వలన జాహ్నవీ అని అన బడడమైనది.

జగామ చ పునర్గంగా భగీరథ రథానుగా |
సాగరం చాపి సంప్రాప్తా సా సరిత్ప్రావరా తదా |
రసాతలముపాగచ్ఛత్ సిద్ద్యర్థం తస్య కర్మణః ||

స|| పునః గంగా భగీరథానుగా జగామ చ సరిత్ ప్రవరా సాగరం చాపి సంప్రాప్తా |తదా తస్య కర్మణః సిద్ద్యర్థం రసాతల ముపాగచ్చత్ |

తా| మరల గంగ భగీరథును అనుసరించి వెళ్ళెను. నదులలో శ్రేష్ఠమైన ఆ నది సాగరమును కూడా చేరెను.అప్పుడు భగీరథుని కార్యసిద్దికై పాతాళము కూడా ప్రవేశించెను.

భగీరథో పి రాజర్షిః గంగామాదాయ యత్నతః |
పితామహాన్ భస్మకృతాన్ అపశ్యత్ దీనచేతసః ||

స|| గంగామాదాయ యత్నతః రాజర్షిః భగీరథః అపి దీన చేతసః భస్మకృతాన్ పితామహాన్ అపస్యత్ |

తా|| ఘోర ప్రయత్నముతో గంగానదిని తీసుకువచ్చిన అ రాజర్షి భగీరథుడు కూడా భస్మము చేయబడిన పితామహుల ను చూచి దీనమైనమనస్సు కలవాడాయెను.

అథ తద్భస్మనాం రాశిం గంగాసలిలముత్తమమ్ |
ప్లావయద్దూత పాప్మానః స్వర్గం ప్రాప్తా రఘూత్తమ ||

స|| అథ తత్ భస్మనాం రాశిం ఉత్తమం గంగా సలిలం ప్లావయత్ ! రఘోత్తమా దూతపాప్మానః స్వర్గం ప్రాప్తా |

తా||ఆ భస్మరాసిని పవిత్రమైన గంగాజలములు ముంచివేసెను. అప్పుడు ఓ రఘురామా ! పాపరహితులై వారు అందరూ సర్గమును పొందిరి.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే త్రిచత్వారింశ స్సర్గః ||
సమాప్తం ||

|| ఈ విధముగా వాల్మీకి రామాయణము లోని బాలకాండలోని నలభైమూడవ సర్గ సమాప్తము ||


|| Om tat sat ||